Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి ఇకలేరు!

ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి(50) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమె నేటి ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. కాగా, రాగతి కోరిక మేరకు సావిత్రిబాయ్ పూలే మోమోరియల్ ట్రస్ట్ ద్వారా కుటుంబ సభ్యులు ఆమె అవయవాల్ని దానం చేశారు. కార్టూనిస్ట్ గా రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళ రాగతి పండరి. చిన్నతనంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నారు. చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేకపోయినప్పటికీ, మానసికంగా ఆమె చాలా దృఢమైన వ్యక్తి. మనోధైర్యంతోనే ఆమె పలురకాల కార్టూన్లు గీసి అందర్నీ నవ్విస్తూ కీర్తినార్జించారు. ఆమెకు విశాఖ జర్నలిస్టులు నివాళులర్పించారు.

More Telugu News